ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: బీజేపీ.. బీసీ వ్యతిరేకి..

ABN, Publish Date - Jul 01 , 2025 | 04:32 AM

బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోమారు నిరూపించుకుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

  • కేసీఆర్‌ సూచనతోనే ఆ నిర్ణయం: బీర్ల అయిలయ్య

  • బీసీలను మోసగించిన మోదీ సర్కారు: జాజుల

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోమారు నిరూపించుకుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలతోపాటు అర్హతలున్న సీనియర్‌ బీసీ నేతలు అనేక మంది ఉన్నా, వారి నుంచి ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడ్ని ఎంపిక చేయలేదని సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పైగా నామినేషన్‌ వేయబోయిన ఒక బీసీ నేతను అడ్డుకున్నారన్నారు. ఫ్యూడల్‌ పార్టీ బీజేపీలో బీసీలకు న్యాయం జరగట్లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అసెంబ్లీ మీడియా హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌ సూచనల మేరకే బీజేపీ.. బలహీనమైన నేత ఎన్‌.రామచంద్రరావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందని ఆరోపించారు.

ఆయన ఎంపికతో బీజేపీ-బీఆర్‌ఎస్‌ కలయిక మరోమారు తేటతెల్లమైందన్నారు. భవిష్యత్తులో బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకే రామచంద్రరావును ఎంపిక చేశారని అయిలయ్య ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నందునే బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా చేశారని అయిలయ్య చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌.. సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవినిస్తామన్న బీజేపీ. వారిని మోసగించిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలన్నీ బీసీ జపం చేస్తుంటే, బీజేపీ భిన్నంగా వ్యవహరించిందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించని పార్టీ.. సీఎంను చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.

Updated Date - Jul 01 , 2025 | 06:48 AM