Ponnam Prabhakar: ఒక్క ట్వీట్‌తో ట్రంప్ యుద్ధం ఎందుకు ఆపారు
ABN, Publish Date - May 13 , 2025 | 05:13 AM
ఎటువంటి చర్చలేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక ట్వీట్‌తో యుద్ధం ఎందుకు ఆపారో జాతికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
చర్చలేకుండా యుద్ధ విరమణతో జాతికి అవమానం
ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రి పొన్నం డిమాండ్
హుస్నాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి చర్చలేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక ట్వీట్‌తో యుద్ధం ఎందుకు ఆపారో జాతికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి ఆయన హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చర్చ లేకుండా యుద్ధ విరమణ చేయడంతో యావత్ జాతి ఆవేదన చెందుతున్నదన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో మన సైన్యం చేసిన పోరాటానికి ప్రతీకార చర్య రూపం దాల్చక ముందే ఒక్క ట్వీట్‌తో యుద్ధ విరమణ చేసి దేశ ప్రజలను అవమాన పరిచారని పేర్కొన్నారు. ఆనాడు ‘మా దేశ సమస్య మేం పరిష్కరించుకోగలం. బయటి దేశాల భాగస్వామ్యం అవసరం లేదని అమెరికాకు ఇందిరాగాంధీ తెలిపారు’ అని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ భద్రతకు తీసుకున్న చర్యలేమిటని ఆయన ప్రశ్నించారు.
Updated Date - May 13 , 2025 | 05:13 AM