Pinnapuram Green Co project: ఏపీ గ్రీన్ కో ప్రాజెక్టు ఒక అద్భుతం: తెలంగాణ డిప్యూటీ సీఎం
ABN, Publish Date - Jun 07 , 2025 | 03:51 PM
ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మితమవుతోన్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి ఏపీని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మితమవుతోన్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి ఏపీని అభినందిస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు, ధర్మల్ పవర్‌తో పాటు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని ఆలోచిస్తున్నామని అందుకోసమే, తెలంగాణ ప్రభుత్వం 2015 న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చిందని మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) చెప్పారు.
తెలంగాణలో 2029-30 నాటికల్లా కనీసం 20 వేల మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. ఏపీలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు(Pinnapuram Green Co project)ను భట్టి ఇవాళ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాణ్యం మండలం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉందని, రానున్న రోజుల్లో పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు.. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించానని భట్టి తెలిపారు.
పవర్ స్టోరేజ్ కోసం గ్రీన్ కో ప్రాజెక్టు వాడే టెక్నాలజీ అద్బుతంగా ఉందని, 4 వేల మెగా వాట్స్ సోలార్ పవర్, ఒక వెయ్యి మెగా వాట్స్ విండ్ పవర్, 1680 మెగా వాట్స్ జల విద్యుత్ ఉత్పత్తి చేసి పీక్ అవర్‌లో ఇతర రాష్ట్రాలకు సప్లై చేసేందుకు గ్రీన్ కో ప్రాజెక్టు సంసిద్దంగా ఉందని భట్టి అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులు దేశంలో ఇంకా రావాలని, వీటివల్ల దేశ జీడీపీ పెరుగుతుందని భట్టి స్పష్టం చేశారు.
కాగా, జనవరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిన్నాపురంలోని గ్రీన్‌కో ప్రాజెక్టును సందర్శించారు. పనులను సమీక్షించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంతోపాటు దేశానికే మంచిపేరు వస్తుందని అన్నారు. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదని పవన్ చెప్పారు. హెలికాప్టర్ ద్వారా గ్రీన్‌కో సోలార్‌పవర్ ప్రాజెక్టును పవన్ పరిశీలించారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 07 , 2025 | 03:53 PM