Hyderabad: భార్య, కొడుకును చూసేందుకు వచ్చి.. హైదరాబాద్‌లో చిక్కిన పాకిస్థానీ!
ABN, Publish Date - Apr 27 , 2025 | 04:43 AM
భారత్‌లో ఉన్న పాకిస్థానీలు వెంటనే వారి స్వదేశానికి వెళ్లిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మహ్మద్ ఫయాజ్ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ సిటీ/మదీన, ఏప్రిల్ 26: భారత్‌లో ఉన్న పాకిస్థానీలు వెంటనే వారి స్వదేశానికి వెళ్లిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మహ్మద్ ఫయాజ్ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫయాజ్ హైదరాబాద్‌లో ఉన్న భార్య, కొడుకును చూసేందుకు అక్రమ మార్గంలో హైదరాబాద్ వచ్చి చిక్కిన పాకిస్థానీ! అతన్ని 2023 ఆగస్టులో బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు. అతను దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్ యువతి ఫాతిమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయిన ఫాతిమా పుట్టింటికి హైదరాబాద్ వచ్చింది. ఆమెకు కొడుకు పుట్టాడు. ఫయాజ్ దుబాయ్‌లో కొంతకాలం ఉద్యోగం చేసి పాకిస్థాన్‌కు వెళ్లాడు. భార్య, కొడుకును చూడాలనుకున్న అతను హైదరాబాద్‌లోని అత్తమామల సూచనతో నేపాల్ మీదుగా భారత్ సరిహద్దు వరకు చేరుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ వెళ్లిన ఫయాజ్ అత్తమామలు.. అక్కడి మధ్యవర్తుల సాయంతో కొంత డబ్బు ఖర్చుపెట్టి అతన్ని సరిహద్దు దాటించారు. రహస్యంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. పది నెలలపాటు బయటకు రానివ్వకుండా ఇంట్లోనే ఉంచారు. నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సంపాదించి, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో ఆ నోటా ఈ నోటా పడి ఫయాజ్ విషయం బహదూర్‌పురా పోలీసులకు చేరడంతో అతన్ని అరెస్టు చేశారు. అత్తమామలపైనా కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై విడుదలైన ఫయాజ్ చిరు వ్యాపారం చేసుకుంటూ భార్య, కొడుకుని పోషించుకుంటున్నాడు. ప్రస్తుత తరుణంలో అతని కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 27 , 2025 | 08:48 AM