ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Osmania Hospital: బీటెక్‌ విద్యార్థినికి ఉస్మా‘నయా’ జన్మ!

ABN, Publish Date - Jul 19 , 2025 | 04:07 AM

కాలేయం పూర్తిగా చెడిపోయి.. కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పదిహేడేళ్ల బాలికకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు

  • కోమాలో ఉన్న బాలికకు కాలేయ మార్పిడి

  • దాతల కోసం జీవన్‌దాన్‌ సూపర్‌ అర్జెంట్‌ విభాగంలో నమోదు

  • 24గంటల్లో లభ్యం.. సర్జరీ విజయవంతం

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాలేయం పూర్తిగా చెడిపోయి.. కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పదిహేడేళ్ల బాలికకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు! అదీ.. జీవన్‌దాన్‌లో సూపర్‌ అర్జెంట్‌ విభాగంలో నమోదు చేసిన 24 గంటల్లోనే ఈ శస్త్రచికిత్స పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో ఇంత వేగంగా రోగికి ప్రయోజనం లభించడం ఇదే మొదటిసారి అని ఉస్మానియా సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి మధుసూదన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌కు చెందిన బ్లెస్సీ గౌడ్‌ అనే బాలిక బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. తీవ్ర జ్వరం రావడంతో మే నెలలో ఆమెను తల్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. ఐదు రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బ్లెస్సీని మే 12న కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బ్లెస్సీని పరీక్షించిన అక్కడి వైద్యులు, ఆమె కాలేయం పూర్తిగా పాడైపోయిందని (Acute Fulminant liver failure ) గుర్తించారు.

48 గంటల్లోగా బ్లెస్సీకి కాలేయ మార్పిడి చేయాలని, లేదంటే ఆమె చనిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాలేయ దానానికి ఆమె తల్లి, కుటుంబసభ్యులు ముందుకొచ్చినా వారిలో ఎవ్వరి కాలేయం కూడా సరిపోదని తేలింది. బ్లెస్సీ పరిస్థితిని వివరిస్తూ కాలేయదానం కోసం జీవన్‌దాన్‌ సూపర్‌ అర్జెంట్‌ కేటగిరిలో ఉస్మానియా వైద్యులు నమోదు చేశారు. ‘జీవన్‌దాన్‌ సూపర్‌ అర్జంట్‌ లివర్‌ ట్రాన్న్‌ప్లాంటేషన్‌ ఎక్స్‌పర్ట్‌ టీమ్‌’ వారి అభ్యర్థనను పరిశీలించి. కాలేయం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి కాలేయం బ్లెస్సీ బ్లడ్‌ గ్రూప్‌తో సరిపోవడంతో జీవన్‌దాన్‌ దానిని బ్లెస్సీకి కేటాయించింది. ఆమెకు మే 14న డాక్టర్‌ మధుసూదన్‌ పర్యవేక్షణలో ఉస్మానియా వైద్య బృందం కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఆమెను ఇంటికి పంపించారు. బ్లెస్సీకి పూర్తి ఉచితంగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశామని డాక్టర్‌ మధుసూదన్‌ కృతజ్ఞతలు తెలిపారు. బాలికకు పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని దామోదర అభినందించారు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:07 AM