ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NVS Prabhakar: కాళేశ్వరం రీ డిజైన్‌ రాజకీయ నిర్ణయమే

ABN, Publish Date - Jun 15 , 2025 | 03:50 AM

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం రాజకీయ నిర్ణయమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు.

  • స్థానిక ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి: బీజేపీ

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం రాజకీయ నిర్ణయమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. మేడిగడ్డ వద్ద పనులకు ఎందుకు టెండర్లు పిలవలేదని, తుమ్మిడిహట్టి గుత్తేదారుకే ఎందుకు కాంట్రాక్టు కట్టబెట్టారని కేసీఆర్‌ను నిలదీశారు. కాగ్‌, పీఏసీ వార్షిక నివేదికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలను ఏటా లేవనెత్తినా.. నాటి సీఎం కేసీఆర్‌ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నేతలు కట్టుకథలు చెప్పారని అన్నారు. స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.2,314 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 03:50 AM