Ponguleti: భూ భారతి దరఖాస్తులకు స్పెషల్ సెల్
ABN, Publish Date - May 23 , 2025 | 04:58 AM
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూ భారతి-2025 చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పర్యవేక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, ఇందుకోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రెవెన్యూ అధికారుల నియామకం
ప్రతి మండలానికి 6-8 మంది సర్వేయర్లు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
ఖమ్మం/హైదరాబాద్, మే 22 (ఆంరధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూ భారతి-2025 చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పర్యవేక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, ఇందుకోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఖమ్మం కలెక్టరేట్‌లో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భూభారతి చట్టం వచ్చిన తర్వాత 33 జిల్లాల్లో 29 జిల్లాల్లో ప్రత్యక్షంగా వెళ్లి సదస్సులు నిర్వహించామని, పైలెట్ ప్రాజెక్టు కింద పెట్టిన నాలుగు మండలాల్లో ఒకటైన నేలకొండపల్లిలో 3,200దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 50శాతం సాదాబైనామాలు గురించి ఉన్నాయన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్‌తోపాటు రెవెన్యూ యంత్రాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం 4.50 లక్షల లక్షల ఇళ్లను నిర్మించనుందని, ఇందులో 1.90 లక్షల మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశామని, మరో 2.50 లక్షల మంది ఎంపిక కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. జూన్ 2న వెయ్యి కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేయనున్నాయని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం, అక్రిడేషన్ల మంజూరుపై ప్రెస్‌అకాడమీ చైర్మన్‌తోపాటు యూనియన్ ప్రతినిధులతో చర్చలు చేపట్టామని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
413 నక్ష గ్రామాల్లో 26 నుంచి రీ సర్వే
భూ విస్తీర్ణం, భూ లావాదేవీల ఆధారంగా ప్రతి మండలానికి 6 నుంచి 8 మంది సర్వేయర్లను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. తొలి విడతలో 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా ఎంపికైన వారికి ఈ నెల 26నుంచి శిక్షణ ఇస్తామని చెప్పారు. నిజాం కాలం నుంచి సర్వే జరగని, ఇప్పటి వరకు సర్వే రికార్డులు లేని 413నక్ష గ్రామాల్లో రీ సర్వే నెల రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయోగాత్మకంగా ఐదు గ్రా మాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 23 , 2025 | 04:58 AM