ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

ABN, Publish Date - Jun 03 , 2025 | 09:45 AM

Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్‌ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌, నవీన్‌, మధుకర్‌గౌడ్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయ్యారు.

Nizamsagar backwaters tragedy

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌ (Nizamsagar Backwaters)లో ఈతకు (Swimming) వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు (Three youths missing) అయ్యారు. ఎల్లారెడ్డి మండలం, సోమార్ పేట్‌లో క్రికెట్ ఆడటానికి ఎల్లారెడ్డికి చెందిన యువకులు వెళ్లారు. క్రికెట్ ఆడిన తర్వాత నిజాంసాగర్ నీటిలో స్నానం చేయడానికి స్నేహితులు వెళ్లారు. బ్యాక్‌వాటర్‌లో మునిగి ముగ్గురు యువకులు (మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిజాంసాగర్ వద్దకు చేరుకుని రాత్రి నుంచి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న యువకుల కుటుంబీకులు, గ్రామస్తులు నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.


వివరాల్లోకి వెళితే..

అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్‌ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ (16), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్‌ (17), ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్‌గౌడ్‌ (17) నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. కాగా సోమార్‌పేట గ్రామంలో 11 మంది యువకులు క్రికెట్‌ ఆడారు. మధ్యాహ్నం వేళ ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకు హాసన్ పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో దిగారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు.


మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యం..

వెంటనే మిగతా యువకులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సోమవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో గజఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో పరిస్థితులు అనుకూలంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు ప్రారంభించగా మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలు

చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 09:45 AM