ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Malnadu Kitchen Drugs: పోలీసు అధికారి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీలు

ABN, Publish Date - Jul 19 , 2025 | 04:37 AM

మల్నాడు కిచెన్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు అధికారి వేణుగోపాల్‌రావుకు సంబంధించిన ఒక ఫామ్‌హౌ్‌సలో.. అతని కుమారుడు రాహుల్‌ తేజ్‌ తరచూ డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించేవాడని ఈగల్‌ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది.

  • మల్నాడు కిచెన్‌ కేసులో కొత్తకోణం

  • పబ్‌లే కాదు.. ఫామ్‌హౌ్‌సలలోనూ సూర్య, తేజ్‌ హల్‌చల్‌

  • సూర్య రెగ్యులర్‌ కస్టమర్లకు ఈగల్‌ పిలుపు

  • హైకోర్టును ఆశ్రయించిన పబ్‌ యజమాన్యాలు

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మల్నాడు కిచెన్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు అధికారి వేణుగోపాల్‌రావుకు సంబంధించిన ఒక ఫామ్‌హౌ్‌సలో.. అతని కుమారుడు రాహుల్‌ తేజ్‌ తరచూ డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించేవాడని ఈగల్‌ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. ములుగులో ఆ ఫామ్‌హౌ్‌సలో సూర్యతోపాటు తేజ్‌ వారానికోసారి కస్టమర్ల కోసం డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించేవారని అధికారులు నిర్ధారించారు. మరోవైపు రాహుల్‌ తేజ్‌, సూర్య స్థానిక కోర్టులో బెయిల్‌ పిటిషన్లు వేశారు. కాగా.. డ్రగ్స్‌ పార్టీల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసిన 9 పబ్‌లపై సైబరాబాద్‌ ఈగల్‌ టీమ్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే..! పబ్‌ యాజమాన్యాల్లో కొందరికి ఈగల్‌ నుంచి నోటీసులు వెళ్లాయి.

దీంతో.. వాక్‌కోరా, బ్రాడ్‌వే, క్వాక్‌ పబ్‌ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ.. క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై ఈగల్‌ బృందం బలమైన కౌంటర్‌ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు శుక్రవారంతో ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అటు సూర్య, తేజ్‌ కాల్‌లిస్టు ఆధారంగా ఈగల్‌ బృందాలు వారి కస్టమర్ల చిట్టాను సిద్ధం చేసినట్లు తెలిసింది. వీరందరికీ ఈగల్‌ బృందాలు త్వరలో నోటీసులు జారీ చేసి, విచారించనున్నట్లు తెలిసింది..

Updated Date - Jul 19 , 2025 | 04:37 AM