ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘యశోద’లో రోబోటిక్‌ న్యూరో సర్జరీ విభాగం

ABN, Publish Date - Apr 27 , 2025 | 04:27 AM

మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో న్యూరో ఎండోస్కోపీ గత రెండు దశాబ్దాల్లో ఎంతో పురోగతి సాధించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తు తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో న్యూరో ఎండోస్కోపీ గత రెండు దశాబ్దాల్లో ఎంతో పురోగతి సాధించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తు తెలిపారు. అతి తక్కువ కోతతో శస్త్రచికిత్స, రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ విధానం ప్రత్యేకతలని చెప్పారు. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో స్కల్‌బేస్‌ ఎండోస్కోపీ సదస్సుతో పాటు ‘రోబోటిక్‌ న్యూరో సర్జరీ-న్యూరో ఎండోస్కోపిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను చోంగ్తు ప్రారంభించారు. రోబోటిక్‌ ఎండోస్కోపీతో మెదడులో లోతుగా ఏర్పడిన కణితులను సైతం కచ్చితత్వంతో తొలగించడానికి వీలవుతుందని యశోద ఆస్పత్రుల గ్రూప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి తెలిపారు.


ఇది ఇప్పటి వరకు అనుసరిస్తున్న శస్త్రచికిత్సా విధానాన్ని పూర్తిగా మార్చివేయగల పరిణామమన్నారు. కడుపులో కణితులను ల్యాప్రోస్కోపీ సర్జరీతో ఎలా తొలగిస్తారో, ఇప్పుడు రోబోటిక్‌ ఎండోస్కోపీతో మెదడులో కణితులను తొలగించవచ్చని సీనియర్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ అయ్యదురై, సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ చెప్పారు. పుర్రెను తెరవాల్సిన అవసరం ఉండదన్నారు.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 04:27 AM