NEET 2025: నేడే నీట్
ABN, Publish Date - May 04 , 2025 | 03:31 AM
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జరగనుంది. రెండు షిఫ్టుల్లో.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో షిప్టులో పరీక్ష నిర్వహిస్తారు.
పాత పద్ధతిలోనే పరీక్ష.. రాష్ట్రం నుంచి 72,507 మంది
190 కేంద్రాల్లో.. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణ
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జరగనుంది. రెండు షిఫ్టుల్లో.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో షిప్టులో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి 72,507 మంది విద్యార్ధులు నీట్‌కు హాజరుకాబోతున్నారు. రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. 26 వేల మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీకైన నేపఽథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
పాత పద్ధతిలోనే పరీక్ష
కోవిడ్‌కు ముందు నీట్‌లో.. ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నల చొప్పున నాలుగు సబ్జెక్టుల (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇచ్చేవారు. అన్నింటికీ జవాబివ్వాలి. కోవిడ్ తర్వాత మార్పులు చేశారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఇస్తున్నారు. ఇందులో సెక్షన్-ఏ కింద ఉండే 35 ప్రశ్నల్లో అన్నింటికీ జవాబు రాయాలి. సెక్షన్-బీలోని 15 ప్రశ్నల్లో ఏవైనా పదింటికి జవాబు ఇవ్వాలి. అంటే మొత్తంగా 200 ప్రశ్నల్లో.. 180 ప్రశ్నలకు జవాబులు రాయాలి. కానీ ఈ ఏడాది నుంచి తిరిగి పాత విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే.. అన్నింటికీ జవాబులు రాయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 05:43 AM