ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నవీన్‌మిట్టల్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వండి

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:53 AM

హైదరాబాద్‌ కలెక్టర్‌ హోదాలో గుడిమల్కాపూర్‌ నానల్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 284/6లో 5,262 చదరపు గజాల స్థలానికి అక్రమంగా ఎన్‌వోసీ ఇచ్చి.. దాన్ని కబ్జా చేసి ఇతర నిందితులతో కలిసి అద్దెకు ఇచ్చుకున్నారనే ఆరోపణలపై ఐఏఎస్‌ నవీన్‌మిట్టల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలయ్యాయి.

  • హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌ కలెక్టర్‌ హోదాలో గుడిమల్కాపూర్‌ నానల్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 284/6లో 5,262 చదరపు గజాల స్థలానికి అక్రమంగా ఎన్‌వోసీ ఇచ్చి.. దాన్ని కబ్జా చేసి ఇతర నిందితులతో కలిసి అద్దెకు ఇచ్చుకున్నారనే ఆరోపణలపై ఐఏఎస్‌ నవీన్‌మిట్టల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన నవీన్‌మిట్టల్‌ ప్రాసిక్యూషన్‌కు సీఆర్పీసీ సెక్షన్‌ 197 ప్రకారం ప్రభుత్వ ముందస్తు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శాంతి అగర్వాల్‌ (84) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం..

ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి ఇచ్చే అంశంపై వివరణ ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీ (సీఎస్‌), ఐఏఎస్‌ నవీన్‌మిట్టల్‌ తదితరులకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు అక్రమ ఎన్‌వోసీ వ్యవహారంలోనే నవీన్‌మిట్టల్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ దిగువ కోర్టులో శాంతి అగర్వాల్‌ ఫిర్యాదు చేశారు. అయితే నవీన్‌మిట్టల్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేదనే కారణంతో దిగువ కోర్టు దాన్ని తీసుకోలేదు. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టులో మరో క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో సైతం నవీన్‌మిట్టల్‌ తదితరులకు హైకోర్టు నోటిసులు జారిచేసింది. తదుపరి విచారణ జూలై 31కి వాయిదాపడింది.

Updated Date - Jun 20 , 2025 | 04:55 AM