ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Alia Begum Statement: మా అన్న అలాంటోడు కాదు..

ABN, Publish Date - May 21 , 2025 | 05:01 AM

ఉగ్రవాదులతో తన అన్నకు ఎలాంటి సంబంధం లేదని సమీర్‌ సోదరి అలియా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ నేపథ్యంలో తమ కుటుంబాన్ని తప్పుగా చూపించడంపై ఆమె స్పందించారు.

  • ఉగ్రవాదులతో సంబంధాలు లేవు

  • సమీర్‌ చెల్లెలు అలియా బేగం

అడ్డగుట్ట, మే 20 (ఆంధ్రజ్యోతి) : ఉగ్రవాదులతో తన అన్నకు ఎలాంటి సంబంధం లేదని విజయనగరం పోలీసుల అదుపులో ఉన్న సమీర్‌ సోదరి అలియా బేగం ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మంగళవారం మాట్లాడుతూ... ఈ నెల 16న తమ ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చి సమీర్‌ను వెంట తీసుకెళ్లడమే కాకుండా ఇంట్లో పూర్తిగా తనిఖీలు చేశారని తెలిపింది. తన అన్నకు సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్న సిరాజ్‌ ఎవరో తమకు తెలియదని, సమీర్‌ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పింది. సమీర్‌ను తీసుకెళ్లింది ఎవరు? ఎక్కడికి తీసుకెళ్లారు... ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి... అసలేం జరిగిందో పోలీసులే చెప్పాలని కోరింది. న్యాయం కోసం ఒవైసీతో పాటు సీఎం రేవంత్‌ రేవంత్‌ రెడ్డిని కలుస్తానని తెలిపింది. తమ కుటుంబం ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు మీడియాలో కథనాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. సమీర్‌ను పోలీసులు తీసుకెళ్లడంతో బీపీ, మధుమేహ వ్యాధితో బాధపడుతోన్న తమ తల్లికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి వెళ్లి తిరిగి గంటలోపే ఇంటికి చేరుకున్నామని చెప్పింది. ఇప్పటికీ తాము ఆ ఇంట్లోనే ఉన్నామని తెలిపింది.

Updated Date - May 21 , 2025 | 05:03 AM