Scrap Dealers: తుక్కు వ్యాపారుల నుంచి 23 లక్షల లూటీ
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:52 AM
తుక్కు వ్యాపారులకు అమ్మకానికి భారీ ఎత్తున స్ర్కాప్ ఉందని పిలిపించి, వారిపై దాడికి పాల్పడి, రూ.23 లక్షల నగదుతో ఉడాయించిన కేటుగాళ్లను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల్లో సైబరాబాద్ సీపీ ఎస్కార్ట్ కానిస్టేబుల్
కానిస్టేబుల్ సహా ముగ్గురి అరెస్టు
మొయినాబాద్, ఏప్రిల్, 24 (ఆంధ్రజ్యోతి): తుక్కు వ్యాపారులకు అమ్మకానికి భారీ ఎత్తున స్ర్కాప్ ఉందని పిలిపించి, వారిపై దాడికి పాల్పడి, రూ.23 లక్షల నగదుతో ఉడాయించిన కేటుగాళ్లను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో సైబరాబాద్ సీపీ ఎస్కార్ట్ వాహనంలో ఉండే ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్ర్కాప్ వ్యాపారి అజయ్‌కి ముంబైలో వ్యాపారం చేసేప్పుడు నబీ, అతని కుమారుడు మొబిన్ పరిచయం అయ్యారు. హైదరాబాద్‌లో తుక్కు వ్యాపారులను లూటీ చేసే ఉద్దేశంతో వీరు పథకం పన్నారు. హైదరాబాద్‌లో స్ర్కాప్ వ్యాపారం చేసే ఇమ్రాన్, ఉమర్ ఫారూఖ్‌లకు బుధవారం ఫోన్ చేశారు. మొయినాబాద్ మండల పరిధిలోని ఖుత్బుద్దీన్‌గూడలో ఓ ఫామ్‌హౌ్‌సను కూల్చివేస్తున్నారని, అక్కడి తుక్కును కొనుగోలు చేయడానికి రావాలని పిలిచాడు. దాంతో వారిద్దరూ తమ స్నేహితుడు సోహిల్‌తో కలిసి రూ.23 లక్షల నగదుతో మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నారు.
వారు రాగానే.. అజయ్, నబీ, మొబిన్, ఇమ్రాన్ అనే మిత్రుడు, ఫామ్‌హౌ్‌సలో పనిచేసే రాంచందర్, ఖుత్బుద్దీన్‌గూడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్(సైబరాబాద్ సీపీ ఎస్కార్ట్‌లో విధులు) శేఖర్, మసూద్‌తో కలిసి దాడి చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ డాబూదర్పం ప్రదర్శిస్తూ.. అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తూ.. వారి నుంచి లాక్కొన్నాడు. వెంటనే అక్కడి నుంచి కారులో పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన మొయినాబాద్ పోలీసులు.. కానిస్టేబుల్ శేఖర్, రాంచందర్, మసూద్‌ను గురువారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితులు-- అజయ్, మొబిన్, నబీ, ఇమ్రాన్ పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 03:52 AM