ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ఈ మామిడి కిలో రూ.2.50లక్షలు

ABN, Publish Date - May 05 , 2025 | 03:51 AM

ఖమ్మం జిల్లాలో రైతు గరికపాటి వెంకట్రావు విదేశాల నుంచి తెచ్చిన మియాజాకీ మామిడి మొక్కలు ఇప్పుడు కిలోకు రూ.2.50 లక్షల ధరను చేరుకున్నాయి. ఈ ప్రత్యేక రకం మామిడి కోసం రైతు కుక్కలతో పంటను కాపలాగా పెట్టి రక్షిస్తున్నాడు

  • విదేశాల నుంచి మియాజాకీ మామిడి మొక్కలు తెచ్చి సాగు చేసిన ఖమ్మం రైతు

  • కోతకు రావడంతో కుక్కలతో కాపలా

ఖమ్మం రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): కిలో మామిడి కాయల ధర ఎంత ఉంటుంది. రూ.150 మహా అయితే రూ.300 పలుకుతాయి. కానీ ఈ మామిడి కాయలు తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే వీటి ధర కిలో రూ.2.50 లక్షలు.. అందుకే ఈ చెట్లను సాగు చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఇప్పుడు పంట కోతకు రావడంతో కుక్కలను కాపలాగా పెట్టి కాయలను అత్యంత పగడ్బందీగా రక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం బారుగూడెంలోని శ్రీసిటీలో ప్రముఖ వ్యాపారి, రైతు గరికపాటి వెంకట్రావు మియాజాకీ మామిడి మొక్కలను విదేశాల నుంచి తీసుకువచ్చి తన వ్యవసాయక్షేత్రంలో సాగు చేయగా ప్రస్తుతం ఆ చెట్లకు కాయలు వచ్చాయి. 2020 కరోనా సమయంలో జపాన్‌ నుంచి మియాజాకీ రకానికి చెందిన 15 మామిడి మొక్కలను ఒక్కొక్క దానికి రూ.10వేలు పెట్టి తెచ్చి సాగుచేశారు. అందులో 10 చెట్లు మాత్రమే బతికాయి. మూడేళ్ల తరువాత అవి కోతకు వచ్చాయి.


గత ఏడాది ఒక్కో చెట్టుకు 10 కాయలు కాశాయి. ఈ ఏడాది ఒక్కో చెట్టుకు సుమారు 20 నుంచి 30 కాయలు కాశాయి. ఈ రకం మామిడి కాయలకు మార్కెట్లో మంచి ధర ఉండటంతో ఈ ఏడాది మరో 60 మొక్కలు తీసుకువచ్చి సాగు చేశారు. మియాజాకీ మామిడి పండ్లకు జపాన్‌లో మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో తమ తోటలో కాసిన కాయలను ఆ దేశానికి ఎగుమతి చేసే యోచనలో ఉన్నామని రైతు గరికపాటి వెంకట్రావు తెలిపారు. కాగా, మియాజాకీ మామిడి సాగు కేవలం జాపాన్‌లోనే ఎక్కువగా చేస్తుంటారని, ఆ దేశ మార్కెట్‌లో వీటికి లక్షల్లో ధర ఉంటుందని ఖమ్మం హార్టికల్చర్‌, సెరికల్చర్‌ అధికారి మధుసూదన్‌ చెప్పారు. ‘‘ఈ పంటను ఖమ్మం జిల్లాలో మొదటిసారి శ్రీసిటీలో సాగు చేశారు. ఈ జాతి మొక్కలు మన నేలపైనా బతుకుతాయి. ఆసక్తి ఉన్న రైతులు వీటిని సాగు చేసుకోవచ్చు’’అని సూచించారు.

Updated Date - May 05 , 2025 | 09:35 AM