Konda Surekha: తెలంగాణలో పుష్కరాలపై వివక్ష వద్దు: సురేఖ
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:50 AM
పుష్కరాలకు ఏపీ వలే తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రాన్ని కోరారు.
వరంగల్ సిటీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పుష్కరాలకు ఏపీ వలే తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రాన్ని కోరారు. వరంగల్‌లో ఆమె మాట్లాడారు. తెలంగాణలో నిర్వహించే పుష్కరాలపై కేంద్రం వివక్ష చూపరాదని, రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరారు. ఏపీని ఒకలా తెలంగాణను మరోలా చూడడం సరికాదన్నారు.
2027లో నిర్వహించేపుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కావాల్సిన ఏర్పాట్ల కోసం కేంద్రం నిధులు విడుదల చేయాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని కోరారు.
Updated Date - Jun 17 , 2025 | 03:50 AM