ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు.. ఎమ్మెల్యేకు మంత్రి సురేఖ స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Jun 20 , 2025 | 06:15 PM

గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. గోదావరి పుష్కరాల నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారని మంత్రి సురేఖ కామెంట్స్ చేశారు.

MLA Naini Rajender Reddy And Minister Konda Surekha

హైదరాబాద్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మంత్రి కొండ సురేఖ కౌంటర్ ఇచ్చారు. చిట్ చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదన్నారు. అయితే కొందరు తమ సొత్తు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని విమర్శలు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని, అయితే అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మవారు శాఖాహారి అని అందరికీ తెలుసని అన్నారు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నామని, బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని స్పష్టం చేశారు.

నామోషీగా..

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని మంత్రి సురేఖ అన్నారు. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని..అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడని మంత్రి సురేఖ మండిపడ్డారు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడని మంత్రి ఫైర్ అయ్యారు. అదృష్టం ఉంది కాబట్టి నేను మంత్రి అయ్యాను.. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడని, అయితే.. నన్నుమంత్రి పదవి దిగిపోవాలని అనుకుంటే ఎలా? నా కూతురికి అదృష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యే కాలేదు.. కడియం కూతురికి అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ అయ్యింది.. అయితే, నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా? అని మంత్రి సురేఖ ప్రశ్నించారు.

సమానంగా చూడాలి

అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయని అన్నారు. భద్రాచల రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే ఘనంగా పుష్కరాలు జరుగుతాయని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపడం మంచిది కాదని అన్నారు. గోదావరి పుష్కరాల నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని.. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు.

Also Read:

ఎవరికోసమో తెలంగాణ హక్కులు వదులుకోం: రేవంత్‌రెడ్డి

వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్

For More Telugu News

Updated Date - Jun 20 , 2025 | 06:30 PM