ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maoist: మావోయిస్టు దళపతి ఎలా చిక్కారు?

ABN, Publish Date - May 24 , 2025 | 04:33 AM

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

  • నంబాలను కంటికి రెప్పలా కాపాడే బలగాలేవి?

  • నక్సల్స్‌ను అత్యంత సమీపం నుంచి కాల్చిచంపారు

  • ముఖాలపై తుపాకీ బాయ్‌నెట్‌తో కొట్టిన గుర్తులు

  • ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాల అనుమానాలు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నారాయణపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని చెబుతున్న ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు.. ఏ ప్రాంతంలో జరిగిందనేది చెప్పడం చేయలేదు. అలాగే మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అనుమానాలకు తావిస్తోందని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. కేశవరావుకు రక్షణగా కనీసం 50 మంది సాయుధ మావోయిస్టులు కాపలా ఉంటారని, ఎన్‌కౌంటర్‌లో కేవలం 26 మందినే చూపించడం అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు విడుదల చేసిన కేశవరావు ఫొటోను చూస్తే ఆయన గడ్డం చేసుకోవడం, తలపై జుట్టుకు రంగు వేసుకున్నట్లు కనిపించడం, తల కింద ఎర్రదస్తీ ఉండడం అనుమానాలకు తావిస్తుందని పేర్కొంటున్నారు.


ఆయన ఎప్పుడు దస్తీ అలా వాడరని, అది కొత్తగా పెట్టినట్లు కనిపిస్తోందని గతంలో కేశవరావుతో కలిసి పనిచేసిన వారు చెబుతున్నారు. ఇక, ఆయన్ను పడుకోబెట్టిన ప్రదేశంలోని ఆకులను గమనిస్తుంటే ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలాగా లేదని అంటున్నారు. ఆయనతో పాటు మరణించిన మావోయిస్టుల ఫొటోలను చూస్తుంటే చాలామందిని అత్యంత సమీపం నుంచి కాల్చివేసినట్లు ఉందని, వారి ముఖాలపై తుపాకీ బాయ్‌నెట్‌తో కొట్టిన గుర్తులు కనిపిస్తున్నాయని ప్రజాసంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేశవరావుతో పాటు మధు తప్పసనిసరిగా ఉంటాడ ని, ఇద్దరికీ రక్షణగా ఉండాల్సిన వారి విషయంలోనే అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. కేశవరావు అనారోగ్యంతో బాధ పడుతున్నారని, చికిత్స తీసుకుంటుండగా పట్టుకొచ్చి, కాల్చి చంపారన్న ఆరోపణలూ ఉన్నాయి. కేశవరావు తన కదలికల విషయంలో జాగ్రత్తగా ఉంటారని, రక్షణగా కంపెనీ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. వారిలో కనీసం పది మంది దగ్గరైనా ఏకే 47 తుపాకులు ఉంటాయని, పోలీసులు 3 తుపాకులే స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడంతో మిగతా వారు ఏమయ్యారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


పదేళ్లుగా ఒకేచోట?

కేశవరావు పదేళ్లుగా అబూజ్‌మడ్‌ అడవుల్లోని ఒకే ప్రాంతంలో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఆయన అక్కడే ఉన్న ట్లు చెబుతున్నారు. పసిగట్టిన పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఈ నెల 21న ఆయన క్యాంప్‌పై విరుచుకుపడినట్లు చర్చ జరుగుతోంది. కేశవరావు అతి విశ్వాసమే ఎన్‌కౌంటర్‌కు దారితీసిందన్న వాదన కూడా వినిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 04:33 AM