Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్‌లోంచి..
ABN , Publish Date - May 23 , 2025 | 04:58 PM
Viral Video: ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. పెద్ద వర్షం కారణంగా రోడ్డుపై ఓ అర అడుగు వరకు నీళ్లు పొంగి పొర్లుతూ ఉన్నాయి.

ఈ సంవత్సరం కొంచెం ముందుగానే వర్షాకాలం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక, నగరాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటోంది. చిన్న వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. తెరిచి ఉంచిన మ్యాన్ హోల్స్ కారణంగా ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
భారీ వర్షాల కారణంగా నీటితో కప్పబడిన మ్యాన్ హోల్స్‌లో పడి చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వాళ్ల వరకు చాలా మందే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. పెద్ద వర్షం కారణంగా రోడ్డుపై ఓ అర అడుగు వరకు నీళ్లు పొంగి పొర్లుతూ ఉన్నాయి.
ఓ చోట మ్యాన్ హోల్ మొత్తం మూసుకుపోయి ఉంది. ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆ మ్యాన్ హోల్‌లోంచి టక్కున పైకి వచ్చాడు. అర్థనగ్నంగా ఉన్న ఆ వ్యక్తి మ్యాన్ హోల్‌లోంచి పైకి రాగానే విజయగర్వంతో తన రొమ్మును విరిచాడు. అంతటితో ఆగకుండా కింగ్ కాంగ్ లాగా తన గుండెల్ని బాదుకున్నాడు. ఈ సంఘటన ఎప్పుడు.. ఎక్కడ జరిగిందో.. ఆ వ్యక్తి ఎవరో తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ ఆక్వామ్యాన్ అల్ట్రా ప్రో మ్యాక్స్’.. ‘ అతడు అండర్ టేకర్’..అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Metro Rail: మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన ఛార్జీలు..
Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..