ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Banjara Hills: ఇంటికి భోజనానికి పిలిచి అత్యాచారం

ABN, Publish Date - May 30 , 2025 | 05:32 AM

స్నేహం పేరుతో ఓ యువతిని కేటుగాడు దారుణంగా వంచించాడు. బ్లాక్‌మెయిల్‌కు దిగి ఆమె నుంచి రూ.20 లక్షలు కాజేసి, ఇంకా రూ.కోటి ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు.

  • ఆ ఘటననంతా ఫొటోలు, వీడియోలుగా తీసి బ్లాక్‌మెయిల్‌

  • ఇప్పటికే రూ.20 లక్షలు ఇచ్చుకున్న బాధితురాలు

  • మరో కోటి రూపాయలు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి డిమాండ్‌

బంజారాహిల్స్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): స్నేహం పేరుతో ఓ యువతిని కేటుగాడు దారుణంగా వంచించాడు. బ్లాక్‌మెయిల్‌కు దిగి ఆమె నుంచి రూ.20 లక్షలు కాజేసి, ఇంకా రూ.కోటి ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులను భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ ద్వారా మహేంద్రవర్దన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఆమెతో చెప్పుకొన్నాడు. ఇద్దరి మధ్య కొన్నాళ్లు ఫోన్లో మాటలు నడిచాయి. కాఫీషా్‌పకు రమ్మని ఆ వ్యక్తి పిలిస్తే ఆమె వెళ్లింది. అదే ఏడాది ఆగస్టు 15న ఆమెను ఆ వ్యక్తి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు.


ఇంటికొచ్చిన ఆమెను మాటల్లో పెట్టి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చాడు. అది తాగిన కొద్దిసేపటికి మగతలోకి జారుకున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్నంతా ఫొటోలు, వీడియోలు తీశాడు. మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆమెకు ఆ ఫొటోలు, వీడియోలు చూపించి.. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించాడు. తీవ్ర ఆందోళనకుగురైన బాధితురాలు, అతడు అడిగిన ఆ మొత్తాన్ని చేతుల్లో పెట్టింది. కాగా కొన్నాళ్లుగా తనకు రూ.కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని మహేంద్రవర్దన్‌ డిమాండ్‌ చేస్తున్నాడు. తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్‌లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. వేధింపులు పెరగడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - May 30 , 2025 | 10:02 AM