Bhatti Vikramarka: విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం
ABN, Publish Date - May 25 , 2025 | 04:23 AM
తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2034-35 దాకా ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2034-35 దాకా ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి బెంగళూర్‌లో ప్రాంతీయ విద్యుత్ మంత్రుల సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు.
సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకోవడంతో పాటు విద్యుత్ సంస్థల ఆర్థిక పురోగతిపై దృష్టి పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. హరిత ఇంధనానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సోలార్ ప్లాంట్లతో పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు.
Updated Date - May 25 , 2025 | 04:23 AM