Student Protest: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 03:18 AM
రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం చేపట్టిన పాఠశాలలు
పెండింగ్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీల బంద్ విజయవంతం
వామపక్ష విద్యార్థి సంఘాల ‘చలో సచివాలయం’ ఉద్రిక్తత
హైదరాబాద్ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం చేపట్టిన పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సంఘాల పిలుపు నేపథ్యంలో ముందు రోజే విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు చలో సచివాలయం చేపట్టాయి. సంఘం నేతలు అమరవీరుల స్మారక చిహ్నం వరకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ తోపులాట జరిగి, ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పిడిగుద్దులతో బలవంతంగా లాగారని, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో వేశారని విద్యార్థి నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 2253 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదని, 1500 పైగా బడుల్లో మరుగుదొడ్లు లేవని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీకి అడ్డూఅదుపు లేదని, ఎల్‌కేజీ నుంచే రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. సచివాలయానికి వచ్చిన మంత్రులకు సమస్యలు చెప్పాలని వస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ అరెస్టులను ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఢిల్లీలో భారీ వర్షాలు.. ఈత కొలనుల్లా రోడ్లు
న్యూఢిల్లీ, జూలై 23: భారీ వర్షాలతో ఢిల్లీలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు నిలిచాయి. ఆ నీళ్లలో ఈత కొడుతూ, ఇళ్లలోని బాత్ టబ్‌లను పడవల్లాగా నీళ్లలో వేసుకొని అటూ ఇటూ తిరుగుతూ అక్కడి ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ‘‘అన్ని వీధుల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేఖా గుప్తాకు కృతజ్ఞతలు’’ అని ఆప్ నాయకురాలు అతీశీ ఎద్దేవా చేశారు. బీజేపీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆప్ నాయకులు విమర్శించారు. అయితే, తాము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోందని, ఆప్ ప్రభుత్వమే రోడ్లను బాగు చేయలేదని బీజేపీ ఎదురుదాడి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 03:18 AM