ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కవితకు కేటీఆర్‌ షాక్‌..!

ABN, Publish Date - Jul 17 , 2025 | 04:17 AM

బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ షాకిచ్చారు

Kavitha vs KTR
  • టీబీజీకేఎస్‌ ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, గోదావరిఖని, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ షాకిచ్చారు. ఆ సంఘం ఇన్‌చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తాజాగా నియమించడం గులాబీ పార్టీలో, రాజకీయవర్గాల్లో చర్చకు తెర లేపింది. తెలంగాణ భవన్‌లో బుదవారం కేటీఆర్‌ సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కవితకు ఆ పార్టీలో, అనుబంధ సంఘాల్లోనూ ప్రాధాన్యం తగ్గుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

తాజా పరిస్థితి ఇలాఉంటే.. తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీకయిన విషయంలో పరోక్షంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను విమర్శిస్తూ.. కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అదే సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను పటిష్టం చేయడంలో భాగంగా.. ఒక అడుగు ముందుకు వేసి.. సింగరేణి కార్మిక నాయకులను కలుపుకొని.. సింగరేణి జాగృతి పేరిట కమిటీలు కూడా వేశారని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కాగా కొప్పుల ఈశ్వర్‌ నియామకం సందర్భంగా ఇకపై టీబీజీకేఎస్‌ వెంట బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Jul 17 , 2025 | 08:37 AM