KTR: స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు: కేటీఆర్
ABN, Publish Date - Jun 05 , 2025 | 02:51 AM
స్వచ్ఛనగరం హైదరాబాద్‌కు కాంగ్రెస్ తెగులు తగిలిందని.. వారి పాలనావైఫల్యం తెలంగాణ ప్రగతికి శాపంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
స్వచ్ఛనగరం హైదరాబాద్‌కు కాంగ్రెస్ తెగులు తగిలిందని.. వారి పాలనావైఫల్యం తెలంగాణ ప్రగతికి శాపంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదని, నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ గుర్తించాలని ‘ఎక్స్’ వేదికగా ఆయన సూచించారు.
హోం శాఖ, పురపాలక, వైద్యం, వ్యవసాయం, విద్య, నీటిపారుదల... ఇలా అన్ని శాఖలూ విఫలమయ్యాయని, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థులకే కాకుండా.. ఆసుపత్రుల్లోని మానసిక రోగులకూ కలుషిత ఆహారం అందిస్తూ.. వారి ప్రాణాలను హరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
Updated Date - Jun 05 , 2025 | 02:51 AM