Konda Surekha: సరిహద్దు ఉద్రిక్తతలతో.. అందాల పోటీలకు ముడిపెట్టొద్దు
ABN, Publish Date - May 15 , 2025 | 04:15 AM
సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు, అందాల పోటీలకు ముడిపెట్టొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచసుందరి అందాల పోటీల నిర్వహణపై కొందరు పసలేని విమర్శలు చేస్తుండడాన్ని ఆమె ఖండించారు.
‘మిస్ వరల్డ్’పై పసలేని విమర్శలు
తెలంగాణ సంస్కృతి చరిత్రకు ప్రతీక
పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పోటీలు
మంత్రి కొండా సురేఖ
హనుమకొండ, మే 14 (ఆంధ్రజ్యోతి): సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు, అందాల పోటీలకు ముడిపెట్టొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచసుందరి అందాల పోటీల నిర్వహణపై కొందరు పసలేని విమర్శలు చేస్తుండడాన్ని ఆమె ఖండించారు. వరంగల్ కోట ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘మిస్ వరల్డ్’ పోటీదారులతో నిర్వహించిన హెరిటేజ్ వాక్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభం కావడానికి ఏడాది ముందే అందాల పోటీల నిర్వహణ కసరత్తు మొదలైందని గుర్తుచేశారు.
ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. మిస్‌వరల్డ్ పోటీలు ప్రపంచ వేడుక అని, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇది చక్కటి అవకాశమని అన్నారు. వరంగల్ భవ్య, దివ్య, నవ్య నగరంగా పేర్గాంచిందని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపద, చారిత్రక ప్రదేశాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. త్వరలో మామునూరుకు ఎయిర్‌పోర్టు రానుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 15 , 2025 | 04:15 AM