ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KCR Health: ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్‌కు రెండోరోజూ వైద్య పరీక్షలు

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:42 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయుంచుకున్న కేసీఆర్‌..

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయుంచుకున్న కేసీఆర్‌.. శనివారం రెండో రోజూ ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌, చీఫ్‌ గ్యాస్ట్రో ఎంటారాలజిస్టు డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పూర్తి రక్త పరీక్షలు (సీబీపీ), ఎండోస్కోపి చేసినట్లు సమాచారం.

కేసీఆర్‌ ఆస్పత్రిలో దాదాపు గంట సమయం వరకు ఉన్నారు. ల్యాబ్‌ పరీక్షల అనంతరం ఆయన ఏఐజీ నుంచి నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు. కేసీఆర్‌ వెంట బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఉన్నారు. కేసీఆర్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే గ్యాస్ట్రో పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 15 , 2025 | 04:42 AM