ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీఆర్‌ఎస్‌ తొలి జెండా పునరావిష్కరణ

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:52 AM

టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన తొలి జెండాను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పునరావిష్కరించారు.

  • పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన తొలి జెండాను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పునరావిష్కరించారు. ఈ జెండా గుర్తుపై నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇప్పటి వరకు దాన్ని తన వద్ద దాచుకున్నారు. రైతు, నాగలి గుర్తుతో రూపొందించిన ఈ జెండాను పెద్ది సుదర్శన్‌రెడ్డి కేసీఆర్‌కు అందజేశారు. 25 ఏళ్ల సిల్వర్‌జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్‌ దాన్ని పునరావిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఉద్యమ కాలంనాటి పాతజ్ఞాపకాలను నెమరువేసుకొని, పార్టీ పురోగతి, తెలంగాణ సాధన వంటి విషయాలను పార్టీ నేతలతో పంచుకున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 04:52 AM