KCR: మెరుగుపడిన కేసీఆర్ ఆరోగ్యం
ABN, Publish Date - Jul 06 , 2025 | 04:22 AM
తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడింది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడింది. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, సంతోష్ రావు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వచ్చి.. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
వారం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీఆర్‌కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. కేసీఆర్ ఈ నెల 3వ తేదీన యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. రక్తంలో షుగర్ నిల్వలు అధికంగా ఉన్నాయని, సోడియం తక్కువగా ఉందని పరీక్షల్లో తేలటంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
Updated Date - Jul 06 , 2025 | 04:22 AM