BRS MLC Kavitha: మావోయిస్టులను చర్చలకు పిలవాలి
ABN, Publish Date - Apr 29 , 2025 | 03:42 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యంతో వ్యవహరించాలని ఆమె వ్యాఖ్యానించారు
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని రాజకీయపార్టీలతో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలతో.. అనేక మంది నక్సలైట్లు లొంగిపోయారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాంటి విధానాన్ని కొనసాగించాలని, మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహించాలని కోరారు.
Updated Date - Apr 29 , 2025 | 03:42 AM