ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: రేవంత్‌.. పసుపు రైతుల బాధలు పట్టవా?

ABN, Publish Date - Mar 12 , 2025 | 04:34 AM

రాష్ట్రంలో మద్దతు ధర రాక పసుపు రైతులు అల్లాడుతున్నారు. వారిబాధలు, కష్టాలు మీకుపట్టవా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

  • గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌/నార్సింగి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మద్దతు ధర రాక పసుపు రైతులు అల్లాడుతున్నారు. వారిబాధలు, కష్టాలు మీకుపట్టవా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను చిత్తుచేస్తున్నాయని, పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తుంటే ఆ రెండు సర్కార్‌లు కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.


ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.15వేల మద్దతు ధరకు పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలోని సంచార జాతులకు ప్రభుత్వం డీనోటిఫైడ్‌ జాతుల (డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీచేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత గట్టు రామచందర్‌రావును ఎమ్మెల్సీ కవిత కలిసి పరామర్శించారు.

Updated Date - Mar 12 , 2025 | 04:34 AM