ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి లారీలను అడ్డుకున్న యువకులు

ABN, Publish Date - May 16 , 2025 | 11:59 PM

మండలంలోని కొల నూర్‌ అప్పమాయ చెరువు నుంచి నిబంధనలకు విరు ద్ధంగా మట్టి రవాణా చేస్తున్న లారీలను శుక్రవారం గ్రామ యువకులు అడ్డుకున్నారు. కొలనూర్‌లో నల్ల మట్టి తవ్వకాలను ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టర్‌ ఇచ్చిన అనుమతి పత్రంలో స్పష్టత లేకుండా ఉన్నదని నిరసిస్తూ ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న మట్టి లారీలను గ్రామస్థులు, యువకులు లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు.

ఓదెల, మే 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొల నూర్‌ అప్పమాయ చెరువు నుంచి నిబంధనలకు విరు ద్ధంగా మట్టి రవాణా చేస్తున్న లారీలను శుక్రవారం గ్రామ యువకులు అడ్డుకున్నారు. కొలనూర్‌లో నల్ల మట్టి తవ్వకాలను ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టర్‌ ఇచ్చిన అనుమతి పత్రంలో స్పష్టత లేకుండా ఉన్నదని నిరసిస్తూ ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న మట్టి లారీలను గ్రామస్థులు, యువకులు లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు. విషయం తెలుసుకొని అక్కడి చేరుకున్న తహసీల్దార్‌ నిరసన తెలుపుతున్న యువకులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. విలేకరులతో జక్కుల మధు మాట్లాడుతూ తహసీల్దార్‌ నల్ల మట్టి లారీలు పోతా యని, దమ్ముంటే అడ్డుకోండని మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. తహసీల్దార్‌ ఆదేశంతో సీఐ సుబ్బా రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్న జక్కుల మధు, సాతూరి అనిల్‌, మద్దెల శ్రీని వాస్‌, రేగుల తిరుపతి, మాటూరి వంశీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దీంతో నల్ల మట్టి తవ్వ కాలు ఆగకుండా ఇటుక బట్టీల యజమానులు గ్రామం లోని అల్లిమాను చెరువులో తవ్వకాలు ప్రారంభించేం దుకు సంసిద్ధం చేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతిని రద్దు చేయాలని కొలనూర్‌ గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. కాగా, ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా అలాంటిదేమి లేదని, తాను ఎవరితో మాట్లాడలేదని పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:59 PM