యువత అవకాశాలను వినియోగించుకోవాలి
ABN, Publish Date - May 20 , 2025 | 11:54 PM
డీఈఈటీ(డిజిటల్ ఎంప్లాయి మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ)ద్వారా వచ్చే అవకాశాలను యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో డీఈఈటీ పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): డీఈఈటీ(డిజిటల్ ఎంప్లాయి మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ)ద్వారా వచ్చే అవకాశాలను యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో డీఈఈటీ పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు, సంస్థలకు వారధిగా పని చేసేందుకు ప్రభుత్వం డీఈఈటీని ఏర్పాటు చేసిందన్నారు.
జిల్లాలో డీఈఈటీ ప్లాట్‌ఫారంపై 1810మంది యువత ఉపాధి అవకాశాల కోసం రిజిస్ర్టేషన్ చేసుకున్నారని తెలిపారు. యువత ఉపాధి అవకాశాలు పొందేందుకు డీఈఈటీ ఉపయోగపడుతుందని, జిల్లాలోని నిరుద్యోగ యువత రిజిస్ర్టేషన్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. డీఈఈటీ ద్వారా యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని, వారి నైపుణ్యాల ఆధారంగా శిక్షణ సంస్థల సమాచారాన్ని విద్యార్థులకు అందుతుందన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్, డీఆర్‌డీఓ కాళిందిని, పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:54 PM