ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:48 PM

డ్రగ్స్‌, మత్తు పదార్థాల వాడకాన్ని యువత వ్యతిరేకిం చాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధ వారం కలెక్టరేట్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఏర్పా టు చేసిన క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఐయామ్‌ యాంటీ డ్రగ్‌ సోల్డియర్‌ ఫొటో పాయింట్‌ వద్ద కలెక్టర్‌ ఫొటో తీసుకున్నారు.

పెద్దపల్లి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌, మత్తు పదార్థాల వాడకాన్ని యువత వ్యతిరేకిం చాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధ వారం కలెక్టరేట్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఏర్పా టు చేసిన క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఐయామ్‌ యాంటీ డ్రగ్‌ సోల్డియర్‌ ఫొటో పాయింట్‌ వద్ద కలెక్టర్‌ ఫొటో తీసుకున్నారు. యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్‌కు బానిసైన వారి కోసం పునరావాస కేం ద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్‌కు సం బంధించి సమాచారం తెలిసినా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14446కు సమాచారం అందించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి పి వేణు గోపాల్‌రావు అధికారులు పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): బసంత్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీసులు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారికి ఎస్‌ఐ ఆర్‌ స్వామి బహుమతులు అందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి) : మత్తుకు అలవాటు పడితే విచక్షణను కోల్పోతారని ఎస్సై దీకొండ రమేష్‌ అన్నారు. మత్తు పదార్థాల వ్యతిరేక అవ గాహన వారోత్సవాల్లో భాగంగా పొత్కపల్లిలో విద్యార్థులు ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూల నకు ప్రజలు కలిసి రావాలని కోరారు.

కోల్‌సిటీటౌన్‌, (ఆంధ్రజ్యోతి): మత్తు పదా ర్థాల నియంత్రణ వారోత్సవాలలో భాగంగా వన్‌టౌన్‌ ఎస్‌ఐ భూమేష్‌ ఆధ్వర్యంలో మహా త్మా జ్యోతిరావ్‌ పూలే బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్స నిర్వహించారు.

Updated Date - Jun 25 , 2025 | 11:48 PM