ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:38 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నార్కోటిక్‌ బ్యూరో, ఆర్‌ ఎన్‌సీసీ కరీంనగర్‌ ఆధ్వర్యంలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కోల్‌సిటీటౌన్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నార్కోటిక్‌ బ్యూరో, ఆర్‌ ఎన్‌సీసీ కరీంనగర్‌ ఆధ్వర్యంలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌ వంటి వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి విక్రయాలు, సేవించే వారికి దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో విద్యలో రాణిస్తూ విజ్ఞానాన్ని సంపాదించేం దుకు కృషి చేయాలని అదే ఉన్నతమైన స్థానంలో నిల బెడుతుందన్నారు. డ్రగ్స్‌ అలవాట్లకు పాల్పడిన వారిని 1908 నంబర్‌కు తెలియజేయాలన్నారు. సీఐ కృష్ణమూర్తి, ఎస్‌ఐ భూమేష్‌, సిబ్బంది శ్రీనివాస్‌, మఽఽధుసూధన్‌, సం పత్‌, వినోద్‌, పాఠశాల హెచ్‌ఎం భూమయ్య, ఉపాధ్యా యులు భాగ్యలక్ష్మి, సుభద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

కోల్‌సిటీటౌన్‌, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవ కుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు. మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారో త్సవాల్లో భాగంగా సెక్రెడ్‌ హార్ట్‌ హైస్కూల్‌ ఆవరణలో వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో మత్తుప దార్థాల నియంత్రణపై అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ రమేష్‌ మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదం డ్రులకు గురువులకు మంచిపేరు తేవాలని సూచిం చారు. చుట్టు పక్కల ప్రాంతాలలో ఎక్కడైన గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రమేష్‌, భూమేష్‌లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

Updated Date - Jun 23 , 2025 | 11:38 PM