ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరేకంగా యువత పోరాడాలి
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:01 AM
రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరే కంగా యువత పోరాటం చేయాలని ప్రగతి శీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీన గర్‌లో పీవైఎల్ జిల్లా కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ పెరిగిపోయిందని, అక్రమ సంపాదనే ధ్యే యంగా పట్టణాలు, గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
కళ్యాణ్‌నగర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరే కంగా యువత పోరాటం చేయాలని ప్రగతి శీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీన గర్‌లో పీవైఎల్ జిల్లా కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ పెరిగిపోయిందని, అక్రమ సంపాదనే ధ్యే యంగా పట్టణాలు, గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నా అమలు కావడం కాలేదని, ప్రభుత్వాసుపత్రిల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేసి అన్నీ రకాల వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్లక్ష్యం చేస్తున్నా రని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యో గులు, యువత పెడదారిన పడు తున్నారని, మద్యం, డ్రగ్స్, గంజా యి వంటి మత్తు పదార్థాలకు అల వాటు పడి సమాజాన్ని కలుషితం చేస్తున్నా రన్నారు. జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మనోహర్, తిరుపతి, దూలం సతీష్, బాబు, ప్రసాద్, మల్లేషం, అవినాష్, శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 12:02 AM