ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువత క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి

ABN, Publish Date - Jun 09 , 2025 | 11:53 PM

యువత క్రమశిక్షణతో కృషిచేసి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సీఎస్‌ ఆర్‌ క్లబ్‌ అగ్నివీర్‌ శిక్షణ కేంద్రం ముగిం పు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గోదావరిఖని, జూన్‌ 9 (ఆంర ధజ్యోతి): యువత క్రమశిక్షణతో కృషిచేసి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సీఎస్‌ ఆర్‌ క్లబ్‌ అగ్నివీర్‌ శిక్షణ కేంద్రం ముగిం పు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లా డుతూ అగ్నివీర్‌ పరీక్షలకు సిద్ధమయ్యే యువ కులకు ఉచిత శిక్షణ అందిం చేందుకు సింగరేణి సంస్థ అవసరమైన స్థలం కేటాయించిందని, యువతకు శిక్షణ అందించేందుకు అవసరమైన నిధులను ఎన్‌టీపీసీ రామగుండం సంస్థ స్పాన్స ర్‌షిప్‌ చేసినందుకు కలెక్టర్‌ అభినందించారు. ఏప్రిల్‌ నుంచి నేటి వరకు ఉచిత వసతితో కూడిన 140మంది అభ్యర్థులకు అగ్నివీర్‌ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు శిక్షణ అందిం చామన్నారు. వీరికి ఫిజికల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన శిక్షణ కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అగ్నివీర్‌ క్యాంపు విజయవం తంగా నిర్వహించిన సిబ్బందికి కలెక్టర్‌ అభి నందనలు తెలిపారు. రెండు నెలలుగా శిక్షణ శిబిరంలో అలవర్చుకున్న క్రమశిక్షణ కొనసాగిం చాలని కలెక్టర్‌ యువతకు సూచించారు. సిం గరేణి ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌, ఎన్‌టీపీసీ జీఎం ప్రవీణ్‌ చౌహన్‌, రామగుం డం ఏసీపీ ఎం రమేష్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:53 PM