ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:14 AM

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇందిరా మహిళ శక్తి సంబరాలు నిర్వహించారు.

పెద్దపల్లి రూరల్‌ , జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇందిరా మహిళ శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు అనేక పథకాలు తీసుకొచ్చిందని, స్వయం ఉపాధి, బ్యాంకు లింకేజి రుణాలు, వడ్డీ లేని రాయితీ రుణాలు, ఆర్‌టీసీ బస్‌ల కోసం పెట్టుబడి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల మరమ్మతు చేయడంతో పాటు పలు కార్యక్రమాలు మహిళల ద్వారానే చేపడుతుందన్నారు. ఈ అవకాశాలు వినియోగించుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఏపీఎంలు సంపత్‌, కళ్యాణి, రమాదేవి, సీసీలు, ఎంఎస్‌ సిబ్బంది. అన్ని గ్రామ సంఘాల వీవోఏలు, అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:14 AM