మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ABN, Publish Date - May 23 , 2025 | 12:26 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో స్వశక్తి మహిళా సంఘాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వం మహిళా సంఘా లకు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద యేటా కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో స్వశక్తి మహిళా సంఘాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వం మహిళా సంఘా లకు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద యేటా కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు పథకాలపై వివరాలతో కూడిన బుక్‌లెట్ అందించామని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలతోపాటు రాజీవ్ యువ వికా సం, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంఈజీపీ, పీఎంఎఫ్ ఎంఈ వంటి వివిధ పథకాలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక యూని ట్ స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. హార్టికల్చర్, వ్యవ సాయ శాఖ, ఇతర వాణిజ్య కార్యకలాపాల రూపకల్పనపై ఎటువంటి సందే హాలు ఉన్నా అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. త్వరలో మండల స్థాయిలో మహిళా సంఘాలకు ప్రభుత్వ పథకా లపై అవగాహన కల్పిస్తామన్నారు. జడ్పీ సీఈఓ నరేందర్, డీఆర్డీఓ ఎం కాళిందిని, డీడబ్ల్యుఓ వేణుగోపాల్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అన్న ప్రసన్నకుమారి, బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:26 AM