ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:26 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం బురహాన్‌మియాపేట్‌, సుల్తాన్‌పూర్‌, నర్సాపూర్‌ గ్రామా ల్లో సిమెంట్‌ రోడ్లకు భూమిపూజ, మురికికాలువల నిర్మాణం, ఇంది రమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు.

ఎలిగేడు, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం బురహాన్‌మియాపేట్‌, సుల్తాన్‌పూర్‌, నర్సాపూర్‌ గ్రామా ల్లో సిమెంట్‌ రోడ్లకు భూమిపూజ, మురికికాలువల నిర్మాణం, ఇంది రమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6 గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకొని 3500ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా, 2000లపైచిలుకు భూమిపూజ చేసినట్లు తెలిపారు. నిర్మాణ దశ పూర్తి చేసిన లబ్ధిదారులకు రూ.5లక్షలు అందజేస్తుందని, లబ్ధిదారులు 400 ఎస్‌ఎఫ్‌టీ తగ్గకుండా 600ఎస్‌ఎఫ్‌టీ పెరుగకుండా చేసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచి ఏ ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో ప్రతీ ఒక్కరిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ యాకన్న, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో కిర ణ్‌, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, అర్షనపల్లి వెం కటేశ్వర్‌రావు, కొండ తిరుపతిగౌడ్‌, పల్లెర్ల వెంకటేష్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, రాజయ్య, ఇందిరమ్మ లబ్ధిదారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:27 PM