అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:43 PM
అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సోమవారం పెద్దకల్వల, పెద్దబొంకూరు, దస్తగిరిపల్లి గ్రామాల్లో రూ.69 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసిడిం గ్‌లను అందించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సోమవారం పెద్దకల్వల, పెద్దబొంకూరు, దస్తగిరిపల్లి గ్రామాల్లో రూ.69 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసిడిం గ్‌లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమ లు చేసిన ప్రతీ సంక్షేమ పథకంలో పైరవీలతోపాటు కమీషన్‌లు తీసు కొనేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వం కాదని ప్రజా ప్రభు త్వమన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాన న్నారు. నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజారు చేశా మని, రాబోయే 3 ఏళ్లలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామ న్నారు. గతంలో రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేశామన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, రైతుభరోసా కింద ఎకరానికి రూ.12 వేలు అందిస్తున్నామని, మహిళలకు బస్‌లలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధికికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హమీ లను దశల వారీగా అమలు చేస్తామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, ఎంపీవో శరత్‌బాబు, కార్యదర్శి నిషాం త్‌రావు, మాజీ జడ్పీటీసీ బండారి రాంమ్మూర్తి, నూగిళ్ల మల్లయ్య, రాజేందర్, మహేందర్, కారెంగల రమేష్, పెగడ రమేష్, సరోత్తం రెడ్డి, మిట్టపల్లి శ్రీకాంత్, కనుకయ్య, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.
Updated Date - Jun 23 , 2025 | 11:43 PM