అక్రమ దందాలను అడ్డుకుంటాం
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:58 PM
మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ దందాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు స్పష్టం చేశారు. ఆదివారం విలేక రులతో మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సోదరుడి కనుసన్నల్లోనే అక్రమ దందాలు కొనసాగుతు న్నాయని ఆరోపించారు.
మంథని, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ దందాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు స్పష్టం చేశారు. ఆదివారం విలేక రులతో మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సోదరుడి కనుసన్నల్లోనే అక్రమ దందాలు కొనసాగుతు న్నాయని ఆరోపించారు. డబ్బు సంపాదన లక్ష్యంగా ఆయన నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మట్టి దందాలను ప్రోత్సాహిస్తున్నా రన్నారు. జిల్లా కేంద్రంలో మట్టి తవ్వకాలు బంద్ చేస్తుంటే మంథనిలో మాత్రం కొత్త రూల్స్ అమలు చేస్తున్నారన్నారు. రెడ్డి చెరువులో 7 ఇటుక బట్టీల పేరిట మట్టి తీసేందుకు అనుమతులు తీసుకొని మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగిం చారన్నారు. చెరువులో 90 లారీల మట్టిని తీసేందుకు పర్మిషన్ తీసుకొని రోజుల తర బడి మట్టిని తరలిస్తున్నారన్నారు. ఆర్డర్ కాపీ పై ఎలాంటి క్లారిటీ లేదన్నారు. దీని పై న్యాయపరంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికా రులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, మాచీడి రాజుగౌడ్, సత్యనారాయణగౌడ్, తగరం శంకర్‌లాల్, పుప్పాల తిరుపతి, జంజర్ల శేఖర్, కనవేన శ్రీనివాస్, గట్టయ్య, కుమార్‌లు పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:58 PM