జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:30 AM
గోదావరిఖని గోదావరి తీరం లోని సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణానికి గోదావరి ముంపు లేకుండా సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు సింగరేణి సంస్థ రూ.3.5కోట్లు వెచ్చించనున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి సమ్మక్క- సారలమ్మజాతర స్థలాన్ని పరిశీలించి, ప్రాంగణంలో ఆయన విలేక రులతో మాట్లాడారు.
కోల్‌సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని గోదావరి తీరం లోని సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణానికి గోదావరి ముంపు లేకుండా సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు సింగరేణి సంస్థ రూ.3.5కోట్లు వెచ్చించనున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి సమ్మక్క- సారలమ్మజాతర స్థలాన్ని పరిశీలించి, ప్రాంగణంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. గోదావరిఖని సమ్మక్క జాతర ప్రాంగణాన్ని మేడారం మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాంగణం పూర్తిగా ఒక మీటర్ ఎత్తు వరకు మట్టి నింపి ముంపు లేకుండా చర్యలు చేపడుతామన్నారు. పరిసరాల్లోఉన్న 24ఎకరాల స్థలంలో నేచర్ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్‌లో సింగరేణి సంస్థనే అధికారికంగా జాతర నిర్వహించేలా చర్యలు చేపడుతామన్నారు. గోదావరి తీరాన హిందు శ్మశాన వాటికను రూ.4కోట్లతో అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా రిటైనింగ్‌వాల్‌తో పాటు ఇత ర అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈద్గాల అభివృద్ధికి రూ.1.5కోట్లు వెచ్చిస్తున్నామని, మరో రూ.2.5 కోట్లతో శ్మశానవాటికలు, షాదీ ఖానాలు కూడా నిర్మిస్తామన్నారు. ఎకరం స్థలంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు.
కార్పొరేషన్ అభివృ ద్ధికి అదనంగా రూ.40 కోట్ల స్పెషల్ గ్రాంట్ మంజూరైందని, ఇం దుకు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. రూ.10కోట్లతో సింగ రేణి స్టేడియం అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగంగా సింథటిక్ ట్రాక్, ఫుట్‌బాల్ కోర్టు నిర్మిస్తారని, స్టేడియాన్ని విస్తరించి స్విమ్మిం గ్ ఫూల్ మరో చోట నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 7చోట్ల పుష్కరఘాట్లను అభివృద్ధి చేస్తామని, మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్, సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు, జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, జెక్కబోయిన కనకయ్య, మోహన్ రెడ్డి, బంగారు చిన్న రాజన్న, వెంకన్న సాయిలు జన గామ సాయిలు, ఆర్కుటి రాయమల్లు, రామచందర్, సుందర్ రాజు, ముడారి నగేష్, భూమయ్య, ఉదరి కనకయ్య, వెంకన్న, ఆశలు, ఈశ్వర, ఎర్ర మల్లయ్య, పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 12:30 AM