కుష్టు వ్యాధి రహిత సమాజానికి కృషి చేయాలి
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:32 PM
కుష్ఠు వ్యాధి రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని రాష్ట్ర కుష్ఠు వ్యాధి నివారణ బృందం సభ్యులు అన్నారు. గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సోమవారం రాష్ట్ర బృందం సందర్శించింది. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కుష్ఠు వ్యాధి రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని రాష్ట్ర కుష్ఠు వ్యాధి నివారణ బృందం సభ్యులు అన్నారు. గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సోమవారం రాష్ట్ర బృందం సందర్శించింది. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి ఎన్‌డీటీ డ్రగ్ ద్వారా చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని సభ్యులు పేర్కొన్నారు. చికిత్స ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు.
కుష్టు వ్యాధి సర్వే (ఎల్‌సీడీసీ) గురించి వివరించారు. పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించి సలహాలు సూచనలు అందించారు. రాష్ట్ర బృందం వెంకటేశ్వరచారీ, సాకేత రెడ్డి, సుందర్‌తో పాటు పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి అన్న ప్రసన్న కుమారి, దేవీ సింగ్, రమేష్, డాక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 21 , 2025 | 11:32 PM