పంటలకు సరిపడా నీరందించాం
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:33 PM
రైతుల పంటలను కాపాడేందుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించామని, గుంట భూమిని కూడా ఎండిపోకుండా చర్యలు తీసు కున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. చిన్నకలువల సహకార సంఘం పరిధిలోని దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్నకలువల గ్రామాలలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రైతుల పంటలను కాపాడేందుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించామని, గుంట భూమిని కూడా ఎండిపోకుండా చర్యలు తీసు కున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. చిన్నకలువల సహకార సంఘం పరిధిలోని దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్నకలువల గ్రామాలలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం చిన్న కలువలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతు ఈ సీజన్‌లో రైతులు పెద్ద ఎత్తున వరి పండించారని, పంటలకు సరిపడే విధంగా సాగునీటిని అందించామని అన్నారు. నియోజకవర్గంలో నీరందించే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కాలువను పరిరక్షించుకోవడం రైతుల కర్తవ్యమని, వాటిని ధ్వంసం చేయడం, కాలువ నీటిని అడ్డుకోవడం, చెత్త వేయడం, కింది రైతులకు నీరందకుండా చేసే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కాలువల పూడిక తీత పనులు చేపడతామన్నారు. ధాన్యం విషయంలో రైతులు ప్రభుత్వ నిబం ధనలు పాటిస్తూ కేంద్రాలకు తీసుకురావాలని, కొనుగోలు చేసిన రెండు రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఎలాంటి కటిం గ్‌లు లేకుండా వడ్లు కొనుగోలు చేయడంలో రాష్ట్రంలోనే పెద్దపల్లికి గుర్తింపు వచ్చిందని, ఈసారి కూడా సన్న వడ్లకు క్వింటాలుకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు. కేడీసీసీబీ డైరెక్టర్ మోహన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు, రాములు, సాయిరి మహేందర్, సతీష్, లింగయ్య, సాగర్‌రావు, సుగుణాకర్ రావు, మాధవరావు, పాల్గొన్నారు.
పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
ఓదెల, (ఆంధ్రజ్యోతి): మండంలోని ఇందుర్తి, శానగోండలో వడగం డ్ల వాన, గాలి దుమారానికి దెబ్బతిన్న పంట లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎనిమిది గ్రామాల్లో పంట దెబ్బ తిన్నదని సర్వే నిర్వహించి పంట సాయం అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.
పొత్కపల్లి, మడక, కనగర్తి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమ న్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్, సీఈఓ అంజిరెడ్డి, పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 11:33 PM