ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహారాష్ట్ర నేచురల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ప్రతినిధుల పర్యటన

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:12 AM

ఆర్జీ-2 ఏరియాలో గురు వారం మహారాష్ట్ర నేచురల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌(ఎంఎన్‌జీఎల్‌) ప్రతినిధుల బృందం పర్యటించింది. సింగరేణిలో డీజిల్‌, పెట్రోల్‌ వంటి ఇంధనాల విని యోగాన్ని తగ్గించి, పర్యావరణహిత నేచురల్‌ గ్యాస్‌ వినియోగాన్ని ప్రోత్స హించే చర్యల్లో భాగంగా (ఎంఎన్‌జీఎల్‌) బృందం సభ్యులు పర్యటించారు.

యైుటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఆర్జీ-2 ఏరియాలో గురు వారం మహారాష్ట్ర నేచురల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌(ఎంఎన్‌జీఎల్‌) ప్రతినిధుల బృందం పర్యటించింది. సింగరేణిలో డీజిల్‌, పెట్రోల్‌ వంటి ఇంధనాల విని యోగాన్ని తగ్గించి, పర్యావరణహిత నేచురల్‌ గ్యాస్‌ వినియోగాన్ని ప్రోత్స హించే చర్యల్లో భాగంగా (ఎంఎన్‌జీఎల్‌) బృందం సభ్యులు పర్యటించారు. జీఎం ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆర్జీ-2 అధికారులతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. ఇంధన వినియోగ పద్ధతులు, వాహనాల ప్రాసెస్‌, పర్యావరణ హిత చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సింగరేణి అధికారులు బృందం సభ్యులకు వివరించారు. అనంతరం ఓసీపీ-3 వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును పరిశీలించి, క్వారీలో పని స్థలాలను పరిశీలిం చారు.

నేచురల్‌ గ్యాస్‌ వాడకం సాధాసాధ్యాలపై బృందం సమగ్రంగా అధ్య యనం చేయనున్నది. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించగలమని సింగరేణి అధికారు లు, (ఎంఎన్‌జీఎల్‌) బృంద సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎంఎన్‌జీఎల్‌ డైరె క్టర్‌ మేజేర్‌ శంకర్‌ కరాజాగీ, ప్రాజెక్టు అండ్‌ ప్లానింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్కే సింగ్‌, సింగరేణి జీఎం ఓసీపీలు, ఈఅండ్‌ఎం డీవీ ఎస్‌ఎస్‌ఎన్‌ రాజు, పీఓ ఉదయ్‌హరిజన్‌, పీఈ రాజాజీ, పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:12 AM