నెలాఖరులోగా వీ-హబ్ భవనం పూర్తి చేయాలి
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:14 AM
మహిళలకు నైపుణ్య శిక్షణ అందించేందుకు వీ-హబ్ భవనాన్ని ఈ నెలా ఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం రంగంపల్లిలోని వీ-హబ్, రాఘవ పూర్‌లోని మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మహిళలకు నైపుణ్య శిక్షణ అందించేందుకు వీ-హబ్ భవనాన్ని ఈ నెలా ఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం రంగంపల్లిలోని వీ-హబ్, రాఘవ పూర్‌లోని మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం వీ-హబ్ ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రామీణ మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నవంబర్ నాటికి మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలు గా భవనం ప్రారంభించుకోవాలని, ఆ దిశగా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, పంచాయతీ కార్యదర్శి తూముల రవి, బిల్ కలెక్టర్ బుచ్చయ్య అధికారులు, పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయం తనిఖీ
పెద్దపల్లి కల్చరల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రంథా లయాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో గ్రంథాలయంలో ఉన్న పాఠ కులతో గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు అవసరమైన పుస్తకాలు లేకుంటే తెలుపా లని, వాటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామ న్నారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల హాజరు రిజిస్టర్ పరిశీ లించారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్ష లలో మంచి ఫలితాలు వచ్చేలా చదువుకోవాలని సూచించారు.
Updated Date - Jun 13 , 2025 | 12:14 AM