ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్షయ పరీక్షల నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN, Publish Date - Jul 31 , 2025 | 11:49 PM

నవంబర్‌ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్‌లను కలెక్టర్‌ పరిశీలించారు.

పాలకుర్తి, జూలై 31(ఆంధ్రజ్యోతి): నవంబర్‌ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకే అవకాశం ఉన్న వారిని గుర్తించి నవంబర్‌ లోపు స్ర్కీనింగ్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్‌సిడి సర్వే ద్వారా గుర్తించిన మధుమోహం, బీపీ వ్యాధిగ్రస్తులు మందులు సరిగా వాడుతున్నారో లేదో ఫాలో అఫ్‌ చేయాలని అన్నారు. ల్యాబ్‌లో పరీక్ష ఫలితాలు సకాలంలో అందించాలని కలెక్టర్‌ తెలిపారు. ఆసుపత్రి వైద్యులు,నర్సులు,ఏఎన్‌ఎమ్‌లు,అశావర్కర్లు ఉన్నారు.

పలు పాఠశాలల్లో కలెక్టర్‌ తనిఖీలు

పెద్దపల్లి కల్చరల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలిం చారు. విద్యార్థుల తర గతి గదులను సంద ర్శించి పిల్లలకు కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదల రెగ్యులర్‌ మానిటరింగ్‌ చేయాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా చేయించే బోధనపరికరణాల వాడకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట వైద్యాధికా రులు సరళి, లక్ష్మీభవాని, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:49 PM