వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాలి
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:41 PM
వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసె న్స్‌లు తీసుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెం కటస్వామి అన్నారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మార్కండేయకాలనీలో ట్రేడ్ లైసెన్స్‌లపై కార్పొరేషన్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
కోల్‌సిటీ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసె న్స్‌లు తీసుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెం కటస్వామి అన్నారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మార్కండేయకాలనీలో ట్రేడ్ లైసెన్స్‌లపై కార్పొరేషన్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారస్థులు ట్రేడ్ లైసెన్స్‌లు తీసు కుని నగరపాలక సంస్థ ఆదాయం పెరిగేందుకు సహకరించాలన్నారు. వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న భవనాలను రెసిడెన్షియల్ క్యాటగిరి నుం చి కమర్షియల్ మారుస్తున్నామని, లైసెన్స్ ఉన్న షాపుల కొలతలను పరి శీలించి సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకుంటామన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో పొందే విధానంపై అవగాహన కల్పించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రావు, ట్రేడ్‌లైసెన్స్ ఇన్‌చార్జి సంపత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూష ణం, కుమారస్వామి, జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 11:41 PM