ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎంహెచ్‌వోపై దౌర్జన్యం చేసిన వారిని శిక్షించాలి

ABN, Publish Date - May 02 , 2025 | 11:28 PM

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురిచేసిన గోదావరిఖని మమత హాస్పిటల్‌ యజమాన్యం, వైద్యులు, సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య డిమాం డ్‌ చేశారు.

పెద్దపల్లిటౌన్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురిచేసిన గోదావరిఖని మమత హాస్పిటల్‌ యజమాన్యం, వైద్యులు, సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య డిమాం డ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 26న డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి విధి నిర్వహణలో బాగంగా గోదావరిఖని మమత హాస్పిటల్‌ తనిఖీ చేయగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌ ను గుర్తించారని తెలిపారు.

చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా మిషన్‌ కలిగి ఉండడం నేరమని, చర్యలు తీసుకొంటుండగా వైద్యులు నాగిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడ్డారన్నారు. డిఎంహెచ్‌ వోను బెదిరించిన డాక్టర్లపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు మహాంకాళి స్వామి, అతని అనుచరులు, హాస్పిటల్‌ యజమాన్యం, రిసెప్షనిస్ట్‌ ఆనంద్‌ ద్వారా అధికారినిపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించు కోవాలని సూచించారు. మాజీ ఎంపీటీసీ, అంబేద్కర్‌ సంఘం జిల్లా కన్వీనర్‌ లక్ష్మయ్య, కట్కూరి సందీప్‌, కొంకటి లింగమూర్తి, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండ లాల కన్వీనర్లు బుసెల్లి నారాయణ, లక్ష్మణ్‌, పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:28 PM