పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - May 04 , 2025 | 11:48 PM
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం పెగడపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మే 4 ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం పెగడపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తలు ప్రజలకు అండదండగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుర్తించి నాయకుడిగా ఎన్నుకుంటా రన్నారు. గ్రామ గ్రామానికి ప్రభుత్వం ఇంది రమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు. పాండ వుల గుట్టపై గతంలో 270డబుల్ బెడ్‌రూంలు కట్టిన ఇండ్లకు మిగులు పనులు చేయించి కాల్వశ్రీరాంపూర్, ఇప్పలపల్లి గ్రామాలకు చెం దిన నిరుపేదలకు కేటాయిస్తామన్నారు. ప్రభు త్వం నిర్ణయించిన ఇంటి నమూనా ప్రకారమే ఇల్లు కడితేనే ఇందిరమ్మ బిల్లు ఐదు లక్షలు దశలవారీగా వస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎవరైన నిరాధారమైన తప్పుడు ఆరోప ణలు చేస్తే కేసులు తప్పవన్నారు. ప్రభుత్వం సన్నవడ్లు కూడా కొనడం ప్రారంభించిందని కాంటాలు కూడా ప్రారంభమయ్యాయన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏ సమస్య వచ్చినా అలుపెరుగక పనిచేస్తున్నానన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డి అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:48 PM